ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎన్నడూ ఒదులుకొవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా
నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేను రా
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనూరా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదు రా..
గుటక పడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటూ తూరుపు ఇంట తేలుతుంది రా...
నిషా విలాసమెంత సేపు రా...ఉషోదయాన్ని ఎవ్వడాపు రా...
రగులుతున్న గుండె కూడా సూర్య గోళ మంటిదేను రా!
నెప్పి లేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషిమైన నీది కాదు ..బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురు ఉంది సత్తువున్ది ..ఇంతాకన్నా సైన్యము ఉండునా??
ఆశ నీకు అస్త్రం అవును..శ్వాస నీకు శస్త్రమౌను....ఆశయమ్ము సారధౌను ర
నిరంతరం ప్రయత్నముండగా నిరాశ కే నిరాశ పుట్టదా..
ఆయువు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా....